హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ల‌ మ‌ధ్య హోరాహోరీ పోరు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  8 Oct 2024 11:46 AM IST
హర్యానాలో బీజేపీ, కాంగ్రెస్‌ల‌ మ‌ధ్య హోరాహోరీ పోరు

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ ప్రకారం బీజేపీకి భారీ మెజారిటీ వచ్చేలా కనిపిస్తోంది. ఈసీ లెక్కల ప్రకారం బీజేపీకి 47, కాంగ్రెస్‌కు 34 సీట్లు వచ్చాయి. అయితే.. ఈ ఫలితాల్లో ఓట్ షేర్ ఒకటుంది. కాంగ్రెస్ 41 శాతం ఓట్లతో ముందంజలో ఉండగా.. బీజేపీకి 38 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ చాలా స్థానాల్లో బంపర్ ఓట్లతో ముందంజలో ఉండగా.. ప‌లు చోట్ల‌ కొన్ని ఓట్ల తేడాతో వెనుకబడి ఉంది.

హర్యానాలో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు వ‌చ్చాయి. ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం.. కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు చాలా స్థానాల్లో బంపర్ ఓట్లు వస్తున్నాయి. ఈ కారణంగానే దాని ఓట్ల శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ.. చాలా స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ తన ఓట్లను సీట్లుగా మార్చుకునేలా కనిపించడం లేదు.ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఒకటిన్నర శాతం ఓట్లు వచ్చేలా కనిపిస్తోంది. చాలా సీట్లలో ఆమ్ ఆద్మీ పార్టీకి సెక్యూరిటీ డిపాజిట్ గ‌ల్లంతు అయినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఇక్కడ బీఎస్పీకి దాదాపు 2 శాతం ఓట్లు లభిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story