ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఇస్రోలో మరో లాంచ్ ప్యాడ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

By Knakam Karthik  Published on  16 Jan 2025 4:04 PM IST
NATIONAL NEWS, CENTRAL GOVERNMENT, CENRAL GOVT EMPLOYEES, ISRO, CABINET DECISIONS

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, ఇస్రోలో మరో లాంచ్ ప్యాడ్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలివే

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి మోడీ అధ్యక్షతన గురువారం సమావేశమైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 8వ వేతన సంఘం ఏర్పాటు చేసి, త్వరలోనే వేతన సంఘం ఛైర్మన్‌ను నియమించనున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి.

అలాగే ప్రధానంగా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో మూడో లాంఛ్ ప్యాడ్‌ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,985 కోట్ల వ్యయంతో మూడో లాంచ్ ప్యాడ్‌ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతరిక్షంలోకి మానవుడిని పంపే ప్రాజెక్టుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Next Story