ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది.

By Knakam Karthik  Published on  12 Feb 2025 1:06 PM IST
Telugu News, Andrapradesh, Telangana, Bird Flu,

ఏపీలో బర్డ్ ఫ్లూ..తెలంగాణ సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ వైరస్ సోకడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. పక్క రాష్ట్రాల నుంచి వచ్చే కోళ్ల వాహనాలను తనిఖీలు చేసేందుకు చెక్ పోస్టులు ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 24 చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో అనుమానిత ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలోనే కోళ్ల రవాణా చేసే వాహనాలను పశు వైద్య శాఖ చెక్ పోస్టుల వద్ద తనిఖీ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రైతులతో పాటు ప్రస్తుత పరిస్థితిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. తెలంగాణ అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద పశువైద్య శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపడుతున్నారు. అనుమతి లేని కోళ్ల వాహనాలను తెలంగాణలోకి ప్రవేశించడానికి నిరాకరిస్తున్నట్లు చెప్పారు.

కాగా పొరుగు రాష్ట్రాల్లో ఏవియన్ ఇన్ ఫ్లు ఎంజా వ్యాప్తి చెందినట్లు నివేదికలు రావడంతో.. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఓ సర్క్యులర్‌లో కోరింది. HPAI వ్యాప్తిని ఆపడానికి మరియు కోళ్ల జనాభాను కాపాడటానికి బయోసెక్యూరిటీ చర్యలను బలోపేతం చేయాలని కోరింది. కోళ్ల అసాధారణ మరణాలను పశువైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బంది దృష్టికి తీసుకురావడానికి వారికి తెలియజేయాలి. ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణలోకి వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి తీసుకోవలసిన చర్యలను చర్చించడానికి అటవీ శాఖ, పోలీసు శాఖ, ఆరోగ్య శాఖ, పశుసంవర్ధక శాఖలతో జిల్లా స్థాయి సమావేశాలను ఏర్పాటు చేయవచ్చు సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.

Next Story