తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని పరిష్కారం కాని అంశాలపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే అమరావతి- హైదరాబాద్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ రహదారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెండు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెంచేందుకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని నిర్ణయించింది.
ఈ మేరకు డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది. మరికొన్ని సమస్యల పరిష్కారాలకు ఆయా శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు త్వరలోనే అమరావతి రింగ్ రోడ్డు ప్రారంభంకానుంది. ఈ రోడ్డుకు ఉత్తరభాగం నుంచి హైవే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తోంది.