సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు.
By Knakam Karthik
సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్, వారిని దూషించారనే కేసులో..
వైసీపీ మద్దతు దారుడు, సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆయనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో రాయచోటి పోలీసులు హైదరాబాద్ రాయదుర్గంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న పోసానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏపీకి తరలించారు. కాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్‌పై అనుచతి వ్యాఖ్యలు చేశారని పోసాని కృష్ణ మురళిపై ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి.
కాగా.. తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులతోద పోసాని కృష్ణ మురళి వాగ్వాదానికి దిగారు. తనకు నోటీసులు ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారంటూ ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేదని పోసాని చెప్పినా.. అరెస్ట్ చేస్తామని తమకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. కేసు ఉంటే దేశంలో ఏ ప్రాంతానికైనా వెళ్లి అరెస్ట్ చేసే అధికారం తమకు ఉందని పోలీసులు ఆయనకు స్పష్టం చేశారు. కాగా పోలీసులతో వాగ్వాదినికి దిగిన పోసాని వీడియో వైరల్ అవుతోంది.
పోసానిని ఏపీ పోలీసులు ఇవాళ అన్నమయ్య జిల్లా రాజంపేట మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చనున్నారు. వైసీపీ హయాంలో ఎఫ్‌డీసీ ఛైర్మన్ హోదాలో పోసాని కృష్ణ మురళి టీడీపీ నేతలను అసభ్యంగా దూషించారని, రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సెక్షన్ 196, 353(2) 111 రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు అయ్యాయి. కులాల పేరుతో దూషించారని, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.