నిమ్స్ కు 32 ఎకరాలు కేటాయింపు - త్వరలో 2000 పడకల బిల్డింగ్ : హరీష్ రావు

We Will Expand NIMS As 2000 Beded Hospital Says Min HarishRao

By -  Nellutla Kavitha |  Published on  23 Jun 2022 7:16 PM IST
నిమ్స్ కు 32 ఎకరాలు కేటాయింపు - త్వరలో 2000 పడకల బిల్డింగ్ : హరీష్ రావు

నిమ్స్ లో పీడియాట్రిక్ హార్ట్ సర్జరీ యూనిట్ ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. దీన్ని నిర్మించేందుకు రోటరీ క్లబ్ (జూబ్లీహిల్స్) 5 కోట్ల రూపాయల సాయమందించింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ కు మంత్రి హరీశ్ ప్రత్యేక ధాన్యవాదాలు తెలియజేశారు.

"ఇప్పటి వరకు 5 కేజీలు బరువు ఉన్న వారి వరకు ఇక్కడ సర్జరీలు చేశారు. ఇప్పుడు రెండున్నర కేజీల బరువు ఉన్న వారికి కూడా ట్రీట్మెంట్ చేయవచ్చు. తెలంగాణ ప్రభుత్వం 2 లక్షలు నుంచి 5 లక్షలు వరకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం జరిగింది. నిమ్స్ ఆసుపత్రుల్లో హార్ట్ అండ్ కిడ్నీ ,లివర్, లంగ్స్ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ లు ఎక్కువగా జరుగుతున్నాయి.

ముఖ్యమంత్రి కేసీఆర్ నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ప్రతి సంవత్సరం రూ.200 కోట్లు గ్రాంట్స్ ఇవ్వడం జరుగుతుంది. గత 6 నెలల్లో 186 కోట్ల రూపాయల ఇక్విప్ మెంట్ ఇవ్వడం జరిగింది. నిమ్స్ లో కేవలం 166 ఐసియు బెడ్స్ ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్యని మరో 200 పెంచాం. త్వరలో మరో 75 అందుబాటులోకి రానున్నాయి. దీంతో మొత్తం 440 ఐసియు బెడ్స్ అందుబాటులోకి వచ్చినట్టవుతుంది. గతంలో 68 ఉంటే ఇప్పుడు మరో 125 వెంటిలేటర్స్ ని ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఇందులో 25 అడ్వాన్స్ లైఫ్ వెంటిలేటర్ లు కూడా ఉన్నాయి.

50 కోట్ల రూపాయలతో నిర్మించిన 200 పడకల ఎమ్ సి హెచ్ బిల్డింగ్ కి త్వరలో శంఖుస్థాపన చేయనున్నాం. ప్రస్తుతం నిమ్స్ లో 1480 పడకలు ఉన్నాయి. అవి సరిపోతాలేవు. త్వరలో 2000 పడకల బిల్డింగ్ ని నిర్మించనున్నాం. ఎర్రమంజిల్ కాలనీలో నిమ్స్ ఆసుపత్రికి అనుబంధముగా 32 ఎకరాలు కేటాయించాం. త్వరలోనే దీనికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులను ఇవ్వనున్నాం. సూపర్ స్పెషాలిటీ కోర్స్ ప్రారంభిస్తున్నాం. కొన్ని డిపార్ట్మెంట్స్ కి కొత్త యూనిట్స్ పెంచాలని నిర్ణయించడం జరిగింది. 16 పీజీ సీట్లు పెంచేందుకు ఎన్ఎంసీకి ప్రతిపాదనలు పంపడం జరిగింది.'' అని మంత్రి హరీశ్ రావు వివరించారు.

Next Story