బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలముందు బిగ్ షాక్

BJP GHMC Corporators Joined In TRS

By Nellutla Kavitha  Published on  30 Jun 2022 1:47 PM GMT
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలముందు బిగ్ షాక్

హైదరాబాద్ వేదికగా జూలై 2, 3 తేదీల్లోబిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి ఒక రోజు ముందే బీజేపీకి ఊహించని షాక్ తగిలింది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో నలుగురు జీహెచ్ఎంసి బీజేపీ కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ జాయినయ్యారు.

హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్, రాజేంద్రనగర్ కార్పొరేటర్ పొడవు అర్చన ప్రకాష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ డేరంగుల వెంకటేష్, అడిక్ మెట్ కార్పొరేటర్ సునిత ప్రకాష్ గౌడ్, తాండూరు మున్సిపల్ బీజేపీ ఫ్లోర్ లీడర్ సింధూజ గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్ టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ కండువా కప్పి వారిని పార్టీలోకి స్వాగతించారు.

ఇటీవలే బీజేపీ జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో ఢిల్లీలో ప్రధాని మోడీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసారు. మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం హైద్రాబాద్ రానుండగా, సొంత పార్టీ కార్పొరేటర్లు టీఆర్ఎస్ లో చేరడం బీజేపీకి ఊహించని షాక్ గా మారిందిది. ఈ చేరికల కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, దానం నాగేందర్, పైలెట్ రోహిత్ రెడ్డి, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.

Next Story
Share it