న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

By Newsmeter.Network  Published on  8 Dec 2019 2:34 PM GMT
న్యూస్ మీటర్.. టాప్ 10 న్యూస్

1. విషాదంలో మెగా హీరోలు..అనారోగ్యంతో నూర్‌భాయ్‌ మృతి

మెగా హీరోలు విషాదంలో మునిగిపోయారు. హైదరాబాద్‌ మెగా అభిమానులకు సుపరిచితుడైన వ్యక్తి నూర్‌ మహ్మద్‌ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ఫ్యామిలీ అభిమానిగా ఉన్న నూర్‌ భాయ్‌.. పవన్‌ కళ్యాణ్, రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌ ఇలా ఎందరితోనో కూడా సన్నిహితంగా ఉండేవాడు. మెగా కుటుంబానికి మద్ధతుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నూర్‌ భాయ్‌ ఆదివారం మృతి చెందారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

2. ఢిల్లీలో విషాదం.. 43కు పెరిగిన మృతుల సంఖ్య

శ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 43 మందికి చేరింది. మరో 50 మంది పైగా గాయపడ్డారు. క్షుతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లిపోతోంది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా బయటకు తీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Advertisement

3. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం…ఆ తర్వాత బాలికకు నిప్పు

దిశ, ఉన్నావ్ ఘటనలు మరిచిపోక ముందే దారుణం చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలిక కామాంధుల చేతిలో బలైపోయింది. త్రిపుర రాష్ట్రంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన సంచలనంగా మారింది. మైనర్ బాలిక (17)ను ప్రియుడు, అతడి స్నేహితులు కలిసి బంధించి ఒకరి తర్వాత ఒకరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలిని కొన్ని రోజులు పాటు బంధించి పలుమార్లు అత్యాచారం చేసి నిప్పటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బాలిక శనివారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, ప్రియుడు తన తల్లితో కలిసి బాలికకు నిప్పంటించినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Advertisement

4. మహానగరంలో మరో అద్భుత కట్టడం…

హైదరాబాద్ మహా నగరంలో మరో సుందర కట్టడం నిర్మితమైంది. ఇప్పటిదాకా దేశంలో కోల్‌కతా, ముంబాయి, రాజస్థాన్‌లోని కోటా వంటి కొన్ని నగరాలకు మాత్రమే పరిమితమైన తీగల వంతెన ఇకపై హైదరాబాద్‌లోనూ రూపుదిద్దుకుంది. దుర్గం చెరువుపై నిర్మించిన ఈ ఇంపైన నిర్మాణం ప్రారంభమైతే ఈ ప్రాంతం నగరంలో మరో పర్యాటక ప్రదేశంగా మారుతుందనే చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్‌ అనగానే ముందుగా అందరికి గుర్తుకు వచ్చేది చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్. ఇకపై ఈ జాబితాలో కేబుల్‌ బ్రిడ్జి కూడా చేరనుంది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

5. ఆసుపత్రిలో బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ కారు ప్రమాదం నిందితుడు..

హైదరాబాద్ : మితిమీరిన వేగంవల్ల హైదరాబాద్ లోని బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ మీదినుంచి కారు కిందపడిపోయిన ఘటనలో రోడ్డుపై ఉన్న ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ కేసులో నిందితుడైన ఎంపవర్ ల్యాబ్స్ సీఈఓ కల్వకుంట్ల క్రిష్టారావు ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నప్పటికీ ఆసుపత్రినుండి వచ్చిన తర్వాతే ఆయనను అరెస్ట్ చేయడానికి వీలవుతుందని పోలీసులు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

6. ప్రధాని మోడీకి ఎంపీ రేవంత్‌రెడ్డి లేఖ..అందులో ఏముదంటే..!

చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్స్ ప్రాతినిధ్యం తప్పనిసరి అని, రాజ్యాంగం మేరకు ఆయా శాసనసభ, పార్లమెంట్‌లో చోటు కల్పిస్తారని, కానీ వారి ప్రాతినిధ్యం అవసరం లేదని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల స్థానంలో థర్డ్ జెండర్స్‌కి రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆంగ్లో ఇండియన్ కోటాను థర్డ్ జెండర్లకు దక్కేలా సవరణ చేయాలని ఆయన లేఖలో ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పొడిగిస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 344కు శీతాకాల సమావేశాల్లోనే సవరణ చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

7. ‘బాలా మావయ్యా! మీ డైలాగ్ సూపర్’… ట్విట్టర్‌లో ‘లోకేష్‌’ ప్రశంసలు

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘రూల‌ర్‌’. సోనాల్ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తోన్న ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యాన‌ర్‌పై సి.క‌ల్యాణ్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ రిలీజ్‌ చేసింది. పవర్‌ఫుల్ డైలాగ్స్, యాక్షన్, సెంటిమెంట్ వంటి వన్నీ ట్రైలర్‌లో చూపించి సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది చిత్ర బృందం. ఈ ట్రైలర్‌పై బాలయ్య అల్లుడు నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రశంసల వర్షం కురిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

8. యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ప్రసాదంలో బొద్దింక..!

యాదాద్రి లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో లడ్డూ ప్రసాదంలో బొద్దింక కనిపించింది. ఆలయ దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు కొనుగోలు చేసిన లడ్డూను తింటుండగా, అందులో చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. వెంటనే ఆ భక్తుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. లడ్డూలో బొద్దింక గురించి అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ప్రసాదంలో బొద్దింక రావడంతో ఆలయ అధికారులపై భక్తులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

9. ‘దిశ’ నిందితుల ఎన్‌కౌంటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ‘తలసాని’

ఈనెల 6న శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద దిశ కేసులోని నలుగురు నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటన స్థలంలో సీన్‌ రీ కన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా, నిందితులు పరారయ్యేందుకు యత్నించి, పోలీసులపై రాళ్లు రువ్వడంతో ఆత్మరక్షణ కోసం ఎన్‌కౌంటర్‌ చేశారు. నిజానికి దిశ అత్యాచార, హత్య జరిగినప్పటి నుంచి తెలంగాణ పోలీసులు, సీఎం కేసీఆర్ తీరుపై జాతీయ స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయినా లెక్క చేయక ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

10. తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగ..!

తిరుపతి: తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమల బూందీ పోటులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. బూందీ పోటులో బూందీ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీ స్థాయిలో ఎగసి పడుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి..

Next Story
Share it