తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగ..!

By అంజి  Published on  8 Dec 2019 9:42 AM GMT
తిరుమల బూందీ పోటులో అగ్ని ప్రమాదం.. దట్టంగా అలుముకున్న పొగ..!

తిరుపతి: తిరుమలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం మధ్యాహ్నం తిరుమల బూందీ పోటులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ కమ్ముకోవడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. బూందీ పోటులో బూందీ తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైరింజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మంటలు భారీ స్థాయిలో ఎగసి పడుతున్నాయి. ఫైర్‌ సిబ్బంది మాత్రం కొంత మేర మంటలను ఇప్పటికే అదుపు చేయగలిగారు. కాగా ఈ ప్రమాదంలో ఓ కార్మికుడిని స్వల్పగాయాలు అయ్యాయి. మిగిలిన కార్మికులు సురక్షితంగా బూందీ పోటు నుంచి బయటపడ్డారు. దీంతో భారీ ప్రమాదం తప్పినట్లైంది.

బూందీ పూర్తిగా పాడవడంతో శ్రీవారి లడ్డుల తయారీ నిలిచిపోయింది. బూందీ పోటులోని బూందీ సరుకులు, నెయ్యి, శనగ పిండి పాడైపోయింది. బూందీ పోటులోకి ఎవరినీ కూడా అధికారులు అనుమతించడం లేదు. బూందీపోటులో గతంలో కూడా అగ్ని ప్రమాదం సంభవించాయి. అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నా అగ్ని ప్రమాదాలను మాత్రం నివారించలేకపోతున్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును భక్తులు కోరుతున్నారు.

Next Story
Share it