ముఖ్యాంశాలు

  • సహాయక చర్యలు ముమ్మరం
  • ప్రమాదస్థలంలో బాధితుల అహాకారాలు
  • మృతుల సంఖ్య పెరిగే అవకాశం

 

దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఝాన్సీ రోడ్డులోని అనాజ్‌ మండీలో జరిగిన ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 43 మందికి చేరింది. మరో 50 మంది పైగా గాయపడ్డారు. క్షుతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రెస్క్యూ టీం సంఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. సంఘటన స్థలంలో మృతుల కుటుంబీకుల రోదనలతో దద్దరిల్లిపోతోంది. అగ్నిమాపక సిబ్బంది 50 మందిని సురక్షితంగా బయటకు తీశారు. మొత్తం 27 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నాయి. ఇంకా అగ్నిమాపక యాత్రాలను ఘటన స్థలానికి రప్పిస్తున్నారు.

Delhi Fire Accident 2

మృతుల సంఖ్య పెరిగే అవకాశం :

ఉదయం 5.30 ప్రాంతంలో ఒక్కసారిగా భవనంలో మంటలు చెలరేగి అంతటా వ్యాపించాయి. అందరూ గాఢనిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రమాదం జరగడంతో అగ్నికి ఆహుతయ్యారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో గాఢనిద్రలో ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏం చేయలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో గాయపడినవారిని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, అప్పటికే కొందరు చినపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. కొంత మందిని ఆర్ఎంఎల్ ఆస్పత్రిలో, మరికొంత మందిని హిందూరావు ఆస్పత్రికి తరలించారు.  ఘటనా స్థలంలోనే 30 మంది వరకు మృతి చెందడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం

Delhi Fire Accident 3కనిపిస్తోంది.

స్కూలు బ్యాగులు, బాటిళ్లు తయారు చేసి ఫ్యాక్టరీగా గుర్తింపు:

కాగా, అనాజ్ మండిలోని దాదాపు 600 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఓ భవనంలో మంటలు చెలరేగినట్టు డిప్యూటీ ఫైర్ చీఫ్ ఆఫీసర్ సునీల్ చౌధురి వెల్లడించారు. ప్రమాదానికి గురైన భవనం ది స్కూల్ బ్యాగులు, బాటిల్స్, ఇతర వస్తువులు తయారుచేసే ఫ్యాక్టరీగా గుర్తించినట్టు తెలిపారు. ప్రమాదం జరిగే సమయానికి పరిశ్రమలో 15 నుంచి 20 మంది కార్మికులు నిద్రిస్తున్నారని వివరించారు. సహాయక చర్యలు ముమ్మరం చేశామని, ఘటన స్థలంలో దట్టమైన పొగలు వ్యాపించాయని, మంటలు భారీగా వ్యాపించడంతో సహాయ చర్యలకు తీవ్ర ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఈ ప్రమాదంలో ఎంత ఆస్తి నష్టం వాటిల్లింతో తెలియాల్సి  ఉంది.

Delhi Fire Accident 1

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.