చంద్రబాబు చెప్పినట్లే 'సిట్' నివేదిక వస్తుందట..!

లడ్డూ వివాదంపై ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది

By Medi Samrat  Published on  25 Sept 2024 2:55 PM IST
చంద్రబాబు చెప్పినట్లే సిట్ నివేదిక వస్తుందట..!

లడ్డూ వివాదంపై ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగా సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటు చేసింది. లడ్డూ వివాదంపై ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన రెండు రోజుల తర్వాత సిట్‌ ను ఏర్పాటు చేశారు. సిట్ సభ్యులుగా గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి (ఐపీఎస్), డీఐజీ గోపీనాధ జెట్టీ, ఎస్పీ హర్షవర్ధనరాజు ఉన్నారు.

సిట్‌ ఏర్పాటుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఆధీనంలో​ ఉన్న సిట్‌ చంద్రబాబు కోరుకున్నట్టు గానే నివేదిక ఇస్తుందని అన్నారు. ‘పవిత్ర లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ టీడీపీ నిరాధారమైన ఆరోపణలు చేసింది. ఆ నిరాధార ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన సిట్ పూర్తిగా టీడీపీ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ఈ కమిటీ స్వతంత్రంగా పూర్తిస్థాయిలో విచారిస్తుందన్న నమ్మకం లేదు. చంద్రబాబు కోరుకున్నట్టుగానే ఆ నివేదికను సిట్ ఇస్తుంది' అంటూ ట్వీట్ చేశారు విజయసాయి రెడ్డి.

సిట్ విచారణ సరిపోదని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా చెప్పుకొచ్చారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. డీఐజీ ద్వారా విచారణకు ఆదేశించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయం నవ్వు తెప్పిస్తోందని, సిట్‌ విచారణ సరికాదని, ఈ అంశాన్ని సుప్రీంకోర్టు పరిధిలోనే విచారించాలని అన్నారు.

Next Story