వైసీపీ చీఫ్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన కాసేపట్లో తిరుమలకు వెళ్లాల్సివుండగా.. పర్యటనను రద్దు చేసుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలిగించవద్దన్న ఉద్దేశంతో ఆయన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్టు సమాచారం. కాసేపట్లోనే మీడియా ముందు టూర్ రద్దు అంశాలను జగన్ వివరించనున్నారు.
ఇదిలావుంటే డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే జగన్ ఆలయంలోకి రావాలంటూ కూటమి ప్రభుత్వ నేతలు డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు సైతం అదే అభిప్రాయాన్ని వెల్లడించారు.
అంతకుముందు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జగన్‌ను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదన్నారు. డిక్లరేషన్ అడిగితే ఈ ప్రభుత్వ పతనం ఖాయం అన్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వకపోతే.. దర్శనానికి అనుమతి లేదనే హక్కు టీటీడీకి లేదన్నారు. ఐదేళ్లు సీఎంగా పట్టువస్త్రాలు సమర్పించినా.. జగన్‌ను డిక్లరేషన్ అడగడం దారుణం అన్నారు. జగన్ డిక్లరేషన్‌పై రాద్ధాంతం జరుగుతున్నా.. చంద్రబాబు మాట్లాడడం లేదన్నారు. డిక్లరేషన్ వెనుక రాజకీయ కుట్ర ఉందని.. ప్రభుత్వం ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తామని అన్నారు.