టీటీడీ ఆస్తులపై శ్వేతపత్రం రిలీజ్..!
White Paper Release On TTD Assets. శ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. స్వామివారి ఆస్తులపై పూర్తి స్థాయి నివేదికనిస్తూ..
By Medi Samrat Published on 6 Dec 2021 4:40 PM ISTశ్రీవారి ఆస్తులపై టీటీడీ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. స్వామివారి ఆస్తులపై పూర్తి స్థాయి నివేదికనిస్తూ.. శ్వేతపత్రం విడుదల కావడం తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఇది మొదటిసారి. ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం చేయని పని తాజా టీటీడీ పాలక వర్గం చేసింది. వెంకన్న ఆస్తులను తెలియజేస్తూ.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేశారు. స్వామివారి ఆస్తుల పూర్తి వివరాలను తెలుసుకోవడానికి www.tirumala.orgలో అందుబాటులో ఉంచింది. 1974 సంవత్సరం నుంచి స్వామికి చెందిన ఆస్తిపాస్తుల క్రయవిక్రయాలను గురించి వివరాలను ఇందులో పొందుపరిచారు. అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం టీటీడీ అధీనంలో ఉన్న స్వామివారి ఆస్తుల సంఖ్య 1128.
మొత్తంగా 8,088 ఎకరాల 89 సెంట్ల వ్యవసాయ భూమి ఉంది. ఈ మొత్తం భూమిని వ్యవసాయం, వ్యవసాయేత భూములు, స్థలాలుగా విభజించింది. ఇందులో వ్యవసాయ ఆస్తుల సంఖ్య 233. ఈ వ్యవసాయ భూమిలో 2085.ఎకరాలు41 సెంట్లు స్వామివారి పేరు మీద ఉన్నట్లు శ్వేతపత్రంలో తెలిపింది. ఇక వ్యవసాయేతర ఆస్తుల సంఖ్య 895 కాగా ఈ కేటగిరీలో ఉన్న స్థలాలు 6,003 ఎకరాల 48 సెంట్లు ఉన్నాయని స్వామివారి మొత్తం స్థలాల వివరాలను శ్వేత పత్రంలో పేర్కొంది. 2020 నవంబర్ 28వ తేదీ నాటికీ శీవారి ఆస్తుల సంఖ్య 987. ఇక టీటీడీ అధీనంలో 7,753 ఎకరాల 66 సెంట్లు ఉన్నాయని పేర్కొంది. ఈ భూమిలో 172 వ్యవసాయ అవసరాలకు ఉపయోగిస్తున్నామని.. మొత్తం 1,792ఎకరాల 39 సెంట్ల భూమి టీటీడీ పాలక మండలి అధీనంలో ఉందని తెలిపింది.