తిరుపతిలో తప్పిన పెను ప్రమాదం

Welcome Arch Collapse In Tirumala. తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాటు

By Medi Samrat  Published on  19 Sept 2021 4:17 PM IST
తిరుపతిలో తప్పిన పెను ప్రమాదం

తిరుపతిలోని రామానుజ సర్కిల్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాటు చేసిన స్వాగత తోరణం(ఆర్చి) కూలిపోయింది. నగరంలోని రిలయన్స్‌ మార్ట్‌ వద్ద ఈ ఆర్చి ఉంటుంది. ఈ ఘటన కారణంగా రెండు కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో పాటు ఒక వ్యక్తికి గాయాలయ్యాయి. లారీ తగలడంతో ఆర్చి కూలినట్లు అధికారులు తెలిపారు. గరుడ వారధి నిర్మాణ పనుల సమయంలో ఈ తోరణం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న అధికారులు ఆర్చిని తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గరుడవారధి నిర్మాణ పనుల సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది. ఓ లారీ తగలడంతో పాక్షికంగా ఆర్చి దెబ్బతిన్నది.


Next Story