తిరుమ‌ల‌లో 130 రోజులకు మాత్రమే నీరు ఉంది.. భక్తులు, స్థానికులు పొదుపుగా వినియోగించండి : టీటీడీ

ఇప్పటి వరకూ కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి.. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది.

By Medi Samrat  Published on  21 Aug 2024 8:46 PM IST
తిరుమ‌ల‌లో 130 రోజులకు మాత్రమే నీరు ఉంది.. భక్తులు, స్థానికులు పొదుపుగా వినియోగించండి : టీటీడీ

ఇప్పటి వరకూ కురిసిన తక్కువ వర్షపాతం కారణంగా తిరుమలలోని స్థానికులు, యాత్రికుల నీటి అవసరాలను తీర్చడానికి.. తిరుమలలోని ఐదు ప్రధాన డ్యామ్‌లలో లభ్యమయ్యే నీరు రాబోయే 120-130 రోజుల అవసరాలకు మాత్రమే సరిపోతుంది అని టీటీడీ పేర్కొంది. ఈ మేరకు బుధవారం నాడు తిరుమలలో పత్రికా ప్రకటనను విడుదల చేసింది.

తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 43 లక్షల గ్యాలన్ల నీటిని వినియోగిస్తున్నారు. అందులో 18 లక్షల గాలన్లు తిరుమల డ్యామ్‌ల నుండి.. మిగిలిన నీరు తిరుపతిలోని కళ్యాణి డ్యామ్ నుండి సేకరించబడుతుంది. తిరుమలలోని గోగర్భం, ఆకాశ గంగ, పాప వినాశనం, కుమారధార, పసుపుధార డ్యామ్‌ల మొత్తం నిల్వ సామర్థ్యం 14,304 లక్షల గ్యాలన్లు కాగా, ప్రస్తుతం తిరుమలలో కేవలం 5,800 లక్షల గ్యాలన్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

అక్టోబరు 4 నుంచి 12 వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలను సందర్శించే వేలాది మంది భక్తుల ప్రయోజనాల దృష్ట్యా, నీటి వృథాను అరికట్టాలని, అలాగే నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు కొన్ని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించి భక్తులతో పాటు స్థానికులకు విజ్ఞప్తి చేసింది. భక్తులు, స్థానికులు నీటిని అనవసరంగా వృధా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని కోరింది.

Next Story