తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించిన రూ. 300 డిసెంబర్ కోటా ప్రత్యేక దర్శన టిక్కెట్లను నవంబర్ 11న విడుదల చేయనున్నారు. డిసెంబర్ నెల మొత్తం ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. భక్తులు టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో టిక్కెట్లను బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, కరోనా అనంతర పరిస్థితుల తర్వాత తిరుమలలో నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున తిరుమలను సందర్శిస్తున్నారు. డిసెంబర్ నెలలో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఉద్యోగస్తులు సెలవులకు ప్లాన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి భక్తుల తాకిడి పెరుగుతుందని సమాచారం. ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే భక్తులు ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి రిజిస్టర్ చేసుకోవాలి. ప్రత్యేక దర్శన టిక్కెట్లపై క్లిక్ చేసి ఆ తర్వాత, మీరు కోరుకున్న తేదీ, సమయాన్ని ఎంచుకుని, మొత్తాన్ని చెల్లించండి.