శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. 21న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
TTD to Issue Online Darshan Tickets. శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం
By Medi Samrat Published on
18 March 2022 9:19 AM GMT

శ్రీవారి దర్శనానికి సంబంధించి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను మార్చి 21వ తేదీ నుండి వరుసగా మూడు రోజుల పాటు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఏప్రిల్ నెల కోటాను మార్చి 21న, మే నెల కోటాను మార్చి 22న, జూన్ నెల కోటాను మార్చి 23న విడుదల చేస్తారు. రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు సోమవారం నుండి బుధవారం వరకు రోజుకు 30 వేల టిక్కెట్లు, గురువారం నుండి ఆదివారం వరకు రోజుకు 25 వేల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అదేవిధంగా.. సర్వదర్శనం టోకెన్లను రోజుకు 30 వేల టోకెన్లు చొప్పున ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు కేటాయిస్తారు.
Next Story