వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం

TTD key decision regarding VIP break darshans. వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది.

By Medi Samrat
Published on : 26 Nov 2022 9:30 PM IST

వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ మరో కీలక నిర్ణయం

వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంది. శ్రీవారిని దర్శించుకునేందుకు వీఐపీలు పెద్ద ఎత్తున వస్తుంటారు. వీరితో పాటు సిఫారసు లేఖల ద్వారా స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. సామాన్య భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తూ ఉంటుంది. సాధారణ భక్తులకే తమ పెద్ద పీట అని చెబుతున్న టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్‌ దర్శనాల విషయంలో టీటీడీ పలు మార్పులు చేస్తూ వచ్చింది. మొదట్లో ఉదయం, సాయంత్రం బ్రేక్‌ దర్శనం ఉండగా ప్రస్తుతం కేవలం ఉదయం మాత్రమే బ్రేక్‌ దర్శనం ఉంది. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు బ్రేక్‌ దర్శనం కల్పిస్తున్నారు. రాత్రంతా క్యూలైన్లలో ఎదురు చూసే సామాన్య భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ తాజాగా సామాన్య భక్తుల దర్శనాల తర్వాతే వీఐపీలకు దర్శనం కల్పించనున్నారు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు సాగే బ్రేక్‌ దర్శనం సమయాల్లో మార్పులు చేయనున్నారు. డిసెంబర్‌ 1వ తేదీ నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కల్పించనున్నారు. స్వామి వారికి నిత్య కైంకర్యాలు పూర్తయిన వెంటనే రాత్రంతా క్యూలైన్లలో ఉన్న భక్తులకు దర్శనం కల్పించనున్నారు.


Next Story