తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు.

By Medi Samrat  Published on  30 Dec 2024 7:30 PM IST
తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ గుడ్ న్యూస్

తెలంగాణలోని ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ బి.ఆర్.నాయుడు తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను స్వీకరించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు అంగీకరించినట్లు ప్రకటించారు.

ఈ లేఖలు వారానికి నాలుగు రోజులు అంగీకరించనున్నారు, బ్రేక్ దర్శనాలకు రెండు అవకాశాలు, ప్రతి వారం రూ. 300 దర్శనాలకు మరో రెండు లేఖలు అవకాశం ఇవ్వనున్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను ఆమోదించాలని ఎన్నో సార్లు మంత్రులు, ఎమ్మెల్యేలు కోరినా టీటీడీ బోర్డు ఇంతకు ముందు పట్టించుకోలేదు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లెటర్లు అంగీకరించాలనే డిమాండ్ ఈ మధ్య ఊపందుకోవడంతో ఎట్టకేలకు టీటీడీ తెలంగాణ ప్రజా ప్రతినిధులకు గుడ్ న్యూస్ చెప్పింది.

Next Story