ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని టిటిడి చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, బోర్డు సభ్యురాలు జానకి దేవి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. బుధవారం ఉదయం వెలగపూడిలోని క్యాంప్ కార్యాలయంలో వారు ముఖ్యమంత్రిని కలసి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేశారు
ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవో, అదనపు ఈవో ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలను అందించారు. తరువాత వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల సందర్భంగా చేపట్టిన ఏర్పాట్లను చైర్మన్, ఈవో ముఖ్యమంత్రికి వివరించారు.