శ్వేతపత్రం విడుదల చేసిన టీటీడీ
TTD EO Dharmareddy Announced TTD Income. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పలు విషయాలపై కీలక ప్రకటనలు చేస్తూ వస్తోంది.
By Medi Samrat Published on 5 Nov 2022 11:05 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పలు విషయాలపై కీలక ప్రకటనలు చేస్తూ వస్తోంది. ఏయే ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయో ఇప్పటికే ప్రకటించిన టీటీడీ బోర్డు.. తాజాగా శ్వేతపత్రం విడుదల చేసింది. బాలాజీకి సంబంధించి బంగారం,నగదు వంటి ఆస్తులకు సంబంధిచి తిరుమల తిరుపతి దేవస్థానం శ్వేతపత్రం విడుదల చేసింది. మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నాయని తెలిపింది.
మొత్తం బ్యాంకుల్లో రూ. 15,938 కోట్ల డిపాజిట్ ఉన్నట్టుగా తెలిపింది. 10,258.37 కేజీల బంగారం ఉన్నాయని వెల్లడించింది. మూడేళ్లలో శ్రీవారి నగదు డిపాజిట్లు భారీగా పెరిగాయని.. 2019 జూన్ నాటికి రూ. 13,025 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 15,938 కోట్లుకు చేరినట్టుగా పేర్కొంది. 2019 జూన్ నాటికి 7,339.74 కేజీల బంగారం నిల్వలు ఉండగా.. అది ఇప్పుడు 10,258. 37కి చేరిందని తెలిపింది. సెప్టెంబర్ 30/ 2022 నాటికి జాతీయ బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లు 15,938, 68 కోట్లని.. వివిధ బ్యాంకుల్లో ఉన్న వివరాలు ఇలా ఉన్నాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5358.11కోట్లు
యూనియన్ బ్యాంక్- 1694.25 కోట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా- 1839.36 కోట్లు
కెనరా బ్యాంకు 1351 కోట్లు
యాక్సిస్ బ్యాంక్ – 1006.20 కోట్లు
HDFC లిమిటెడ్ 2122.85 కోట్లు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ 555.17 కోట్లు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 660.43 కోట్లు
ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 306.31 కోట్లు
ఇండియన్ బ్యాంక్ 101.43 కోట్లు
ఐసిఐసిఐ బ్యాంక్ 9.70 కోట్లు
సప్తగిరి గ్రామీణ బ్యాంక్ 99.91 కోట్లు
యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ 18.54 కోట్లు
సెంట్రల్ బ్యాంక్ 1.28 కోట్లు
కరూర్ వైశ్యా బ్యాంక్ 4.37 కోట్లు
ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ 4.00 కోట్లు
ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ 1.30 కోట్లు
వివిధ బ్యాంకుల్లో శ్రీవారి బంగారం డిపాజిట్లు మొత్తం 10,258.37 కేజీలు ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 9819.38 కేజీలు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 438.99 కేజీలు ఉన్నాయి. టీటీడీ డిపాజిట్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెడుతున్న ప్రచారం అవాస్తవమని కూడా స్పష్టం చేసింది.