తిరుమలలో రెండో ఘాట్‌ రోడ్డులో కొండ చరియలు విరిగిపడ్డాయి. కొండపై నుండి పెద్ద బండరాయి పడడంతో రోడ్డు మూడు చోట్ల పాకిక్షంగా ధ్వంసమైంది. ఇటీవల భారీ వర్షాలు కురవడంతో తిరుమల రహదారులు దెబ్బతింటున్నాయి. ఘాట్‌ రోడ్డు ధ్వంసం కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్త చర్యగా వాహనాలను నిలిపివేశారు. అనంతరం రెండో ఘాట్‌రోడ్డును తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. లింక్‌ ఘాట్‌ రోడ్డు సమీపంలో కొండపై నుండి బండరాళ్లు రోడ్డు మీద పడడంతో రోడ్డు దెబ్బతింది.

కొండచరియలను తొలగించేందుకు టీటీడీ ఇంజినీరింగ్‌, అటవీశాఖ అధికారులు, విజిలెన్స్‌ సిబ్బంది తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. రాళ్లు, మట్టిపెల్లలు కింద పడే సమయంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. దీంతో రెండో ఘాట్‌రోడ్డులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ఇటీవల తిరుమలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో టీటీడీ పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. కాగా టీటీడీ ఇప్పటికే పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story