శ్రీ వారికి బంగారు కంఠా భరణం కానుకగా సమర్పించిన టీటీడీ చైర్మన్ దంపతులు
Tirumala Tirupati News Update. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు
By Medi Samrat Published on
18 Dec 2022 2:45 PM GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఆదివారం 2 కిలోల 12 గ్రాముల 500 మిల్లీ గ్రాముల శ్రీదేవి సమేత బంగారు కంఠాభరణాన్ని కానుకగా సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ డెప్యూటీ ఈవో రమేష్ కు చైర్మన్ దంపతులు ఈ ఆభరణం అందించారు.
విశ్వ శాంతి కోసం తిరుమల ధర్మగిరి వేద విద్యాపీఠం లో ఈ నెల 12నుండి 18వ తేదీ వరకు నిర్వహించిన శ్రీ శ్రీనివాస విశ్వశాంతి మహా యాగం ఆదివారం మహా పూర్ణాహుతితో విజయవంతంగా ముగిసిందని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మన దేశంపై కరోనా ప్రభావం ఉండకూడదని, ప్రపంచంలోని ప్రజలే కాకుండా సకల జీవులు ఆరోగ్యాంగా ఉండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ యాగం నిర్వహించామన్నారు. తిరుమలలో ఇప్పటి దాకా జరగని ఇలాంటి యాగం స్వామి వారి ఆశీస్సులతో తాము చేయించడం అదృష్టమని చెప్పారు. శ్రీ శ్రీనివాస మహా విశ్వ శాంతి యాగం విజయవంతంగా ముగిసినందువల్ల స్వామి వారికి కానుక సమర్పించామని చెప్పారు.
Next Story