శ్రీవారిని దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?

ఓ వైపు లడ్డూ వివాదం చెలరేగినా తిరుమలకు భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు.

By Medi Samrat  Published on  28 Sept 2024 12:27 PM IST
శ్రీవారిని దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?

ఓ వైపు లడ్డూ వివాదం చెలరేగినా తిరుమలకు భక్తుల తాకిడి ఏ మాత్రం తగ్గలేదు. ప్రస్తుతం 12 కంపార్ట్మెంట్లలో భక్తులు అన్నారు. శ్రీవారి దర్శనానికి 8 గంటలు సమయం పడుతూ ఉంది. గత 24 గంటల్లో 64,158 మంది తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. స్వామి వారికి కానుకల రూపంలో 3.31 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

తిరుమలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన శ్రీవారివార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరితో సమీక్షించారు. తిరుమల అన్నమయ్య భవనంలో నిర్వహించిన సమావేశంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో పాటు జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం, సీవీఎస్‌వో శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈవో మాట్లాడుతూ, అన్ని శాఖల ఏర్పాట్లలో ఎలాంటి రాజీ ఉండకూడదని, అన్నప్రసాదం, ఆరోగ్య (పారిశుద్ధ్యం) విభాగాలు రెండు ముఖ్యమైన విభాగాలుగా ఒకదానికొకటి సమన్వయం చేసుకుని దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. “అన్నప్రసాదం వడ్డించడం పూర్తయిన వెంటనే, చెత్తను తొలగించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో ఆలస్యం చేయకుండా ఆరోగ్య శాఖ పారిశుధ్య కార్మికులను ఆదేశించాలని అని ఆయన సూచించారు.

అనంతరం ఇంజినీరింగ్‌ పనులు, శ్రీవారి ఆలయం, విజిలెన్స్‌ అండ్‌ సెక్యూరిటీ, గార్డెన్‌ మరియు ఫారెస్ట్‌లు, నృత్యం మరియు భజన బృందాలు, రవాణా, గోశాల, మెడికల్‌ విభాగాలను ఈవో పరిశీలించారు. శ్రీవారి సేవకుల సేవలను ఆయా విభాగాలు సక్రమంగా వినియోగించుకోవాలన్నారు.

Next Story