డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

Tirumala Darshan Tickets quota release on december 12. 2023 జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను

By Medi Samrat  Published on  9 Dec 2022 4:42 PM IST
డిసెంబర్ 12న శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల

2023 జనవరి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను డిసెంబర్ 12న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ మేర‌కు టీటీడీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అదేవిధంగా, 2023 జనవరి నెల‌కు సంబంధించి మ‌రికొన్ని ఆర్జిత‌సేవా టికెట్లకు ఆన్‌లైన్ ల‌క్కీడిప్ న‌మోదు ప్ర‌క్రియ.. డిసెంబర్ 12న ఉదయం 10 గంట‌ల‌ నుండి డిసెంబరు 14న ఉదయం 10 గంటల వరకు ఉంటుంది. ఆ తరువాత లక్కీడిప్ లో టికెట్లు కేటాయిస్తారు. భ‌క్తులు ఈ విష‌యాల‌ను గుర్తించి శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల‌ను బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.


Next Story