తిరుమలలో అపచారం
తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది.
By Medi SamratPublished on : 12 April 2025 3:45 PM IST

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద అపచారం చోటు చేసుకుంది. తిరుమలలో పాదరక్షలతో శ్రీవారి ఆలయంలోకి వెళ్లేందుకు భక్తులు ప్రయత్నించారు. భక్తులు చెప్పులతో వెళ్తుండడాన్ని ఆలయ మహాద్వారం వద్ద గుర్తించి భద్రతా సిబ్బంది అడ్డుకుంది. దీంతో పాదరక్షలను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి వెళ్లారు భక్తులు.
వైకుంఠంలోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్, TTDఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది. ఉద్యోగులు పట్టించుకోక పోవడంతో చెప్పులతోనే ఆలయ మహాద్వారం వరకు భక్తులు వచ్చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. అధికారులు చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
తిరుమలలో అపచారం చెప్పులతో గర్భగుడిలోకి భక్తులు | ABN Telugu#Tirumala #TirupatiTemple #TTD #VenkateswaraTemple #RespectTraditions #ABNTelugu pic.twitter.com/etgwkR15B4
— ABN Telugu (@abntelugutv) April 12, 2025
Next Story