తిరుమల అంశంపై దాఖలైన పిటిషన్‌పై భారత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం విచారణను ముగించింది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఓ భక్తుడు పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై ఇరు పక్షాల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం విచారణను ముగించింది. పూజలు, కైంకర్యాలన్నీ సవ్యంగానే జరుగుతున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం న్యాయవాది కోర్టుకు తెలిపారు. స్వామి వారికి చేసే సేవల్లో ఎలాంటి లోటు పాట్లు లేవని, అన్ని సేవలు జరుగుతున్నాయని వివరించారు. కాగా ఆలయాల్లో రోజువారీ కార్యకలాపాలను న్యాయస్థానాలు చేపట్టవని ధర్మాసనం స్పష్టం చేసింది.

కార్యక్రమాల పర్యవేక్షణ ఆగమశాస్త్ర పండితులు చూసుకుంటారని పేర్కొంది. ప్రచారం కోసమే పిటిషన్‌ దాఖలు చేసినట్లు అనిపిస్తోంది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక వేళ కార్యకలాపాల్లో ఏమైనా లోపాలున్నట్లు అనిపిస్తే స్థానిక సివిల్‌ కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సుప్రీంకోర్టు సూచించింది. లోటు పాట్లు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం చెబుతోంది కదా అంటూ పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నిబంధనలకు విరుద్ధంగా ఏమైనా కార్యక్రమాలు జరిగితే ఆగమశాస్త్ర పండితుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. ఇదిలా ఉంటే పిటిషనర్‌ పలు అంశాలపై కోర్టులో మాట్లాడారు. వీటికి 8 వారాల్లో సమాధానం ఇవ్వాలని టీటీడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story