టీటీడీ పాలక మండలి సమావేశం ముగిసింది. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 27న బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయని.. అక్టోబర్ 1న గరుడ వాహనం, 5న చక్రస్నానం నిర్వహిస్తామన్నారు. బ్రహ్మోత్సవాలకు ఎంతమంది భక్తులు వచ్చినా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమలలో భక్తులు రద్దీ తగ్గే వరకు ఇదే దర్శన విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీ తగ్గిన తర్వాత సర్వదర్శన టోకెన్లపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఆగస్ట్ 16 నుంచి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభోత్సవాలు నిర్వహిస్తామన్నారు. 7.32 కోట్లతో యస్వీ గోశాలకు పసుగ్రాసం కోనుగోలు చేయాలని, 2.7 కోట్లతో పార్వేటి మంటపం నూతన నిర్ణయం చేస్తామన్నారు. 154 కోట్ల రూపాయల వ్యయంతో చిన్నపిల్లల ఆసుపత్రికి టెండర్లు ఖరారు చేయనున్నామన్నారు. 2.9 కోట్లతో అమరావతిలో ఆలయం వద్ద పచ్చదనం అభివృద్ది చేయనున్నారు. ఆటోమెటిక్ మెషిన్లతో లడ్డూ బూందీ తయారీపై టీటీడీ సమావేశంలో చర్చించారు. ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ కు చెందిన సాంకేతికత వినియోగించాలని నిర్ణయించారు. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ మార్క్ ఫెడ్ తో ఒప్పందం చేసుకున్నట్టు టీటీడీ చైర్మన్ తెలిపారు.