ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ ముఖ ద్వారం వద్ద ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జేఈవో వీరబ్రహ్మం, ఆలయ డిప్యూటీఈవో లోకనాథం, ఏఈఓ ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు ఘనంగా పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయ ధ్వజ స్థంభంకు మొక్కిన అనంతరం ఆయన కుటుంబ సమేతంగా శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అర్చకులు వేద ఆశీర్వచనం పలికి శేష వస్త్రంతో సత్కరించారు.
జేఈఓ వారికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. వీరితో పాటు అమ్మవారిని దర్శించుకున్నవారిలో తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ నవీన్ రావ్, ఏపీ హైకోర్టు జస్టిస్ మానవేంద్ర నాథ్ రాయ్, దుప్పాల వెంకటరమణ, జస్టిస్ గంగా రావు, జస్టిస్ వెంకట రమణ, హై కోర్టు రిజిస్ట్రార్లు తదితులున్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర రెడ్డి, అదనపు ఎస్పీ కుల శేఖర్, ఆర్డీఓ కనక నరస రెడ్డి, చిత్తూరు జిల్లా ప్రిన్సిపల్ జడ్జి జస్టిస్ భీమరావు, తిరుపతి థర్డ్ ఏడిజె వీర్రాజు, జ్యుడీషియల్ ప్రోటోకాల్ అధికారి ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు.