తిరుపతి వాసులకు స్వామి వారి దర్శనం.. ఈ డేట్స్ చూసుకోండి

శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాలనుకునే తిరుపతి స్థానికుల కోసం జనవరి 5, 2025న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది.

By Medi Samrat
Published on : 23 Dec 2024 4:26 PM IST

తిరుపతి వాసులకు స్వామి వారి దర్శనం.. ఈ డేట్స్ చూసుకోండి

శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమలకు వెళ్లాలనుకునే తిరుపతి స్థానికుల కోసం జనవరి 5, 2025న స్థానిక దర్శన కోటా టోకెన్లను జారీ చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రకటించింది. బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం తిరుపతికి చెందిన వారికి తిరుమలలో దర్శనం కల్పించనున్నారు.

తిరుమల బాలాజీ నగర్‌లోని తిరుపతి మహతి ఆడిటోరియం, కమ్యూనిటీ హాల్‌లో జనవరి 7 (మంగళవారం) దర్శనం కోరుకునే స్థానికులకు జనవరి 5 ఆదివారం నాడు దర్శనం టోకెన్‌లను జారీ చేస్తారు. తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలు, తిరుమల నుండి స్థానికులు టోకెన్లు స్వీకరించడానికి అర్హులు, వారు తమ ఒరిజినల్ ఆధార్ కార్డును అందజేయాలని టీటీడీ సూచించింది.

Next Story