టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

Spot Admission Counseling for admissions in TTD Junior Colleges on 3rd and 4th July. టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో

By Medi Samrat  Published on  1 July 2023 12:42 PM GMT
టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్

టీటీడీకి చెందిన శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి జూన్ 12వ తేదీ నుండి మూడు విడతలుగా కౌన్సెలింగ్ నిర్వహించి ఇంటర్మీడియ‌ట్‌లో ప్రవేశాలు కల్పించారు. ఈ కౌన్సెలింగ్ లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇదివరకే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి జూలై 3, 4వ తేదీల్లో స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మొదట టీటీడీ ఉద్యోగుల పిల్లలకు, ఎస్వీ బాలమందిరం పిల్లలకు, ఇదివరకు మూడు విడతల్లో సీటు వచ్చి వివిధ కారణాలతో అడ్మిషన్ పొందలేని వారికి, తిరుపతి స్థానిక విద్యార్థులకు, స్థానికేతరులకు ఈ ప్రాధాన్యత ప్రకారం సీట్లు కేటాయిస్తారు.

జూలై 3న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పదో తరగతిలో 540(90%), ఆపై మార్కులు పైన వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 539 నుండి 500 మార్కులు వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. జూలై 4న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 499 నుంచి 450 మార్కులు వచ్చిన వారికి, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు 449 నుంచి 360 మార్కుల వరకు వచ్చిన వారికి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్ కు హాజరయ్యే వారు అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ముందుగా తెలుసుకోవాలని టీటీడీ కోరింది. స్పాట్ అడ్మిషన్ లో ప్రవేశాలకు హాస్టల్ వసతి ఉండదు. పదో తరగతి ఇంగ్లీష్ మీడియంలో చదివిన విద్యార్థులకు అదే మీడియంలో మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. వారికి తెలుగు మీడియం గ్రూపులు కేటాయించడం జరుగదని వెల్ల‌డించింది.


Next Story