ఢిల్లీ, తిరుపతి నగరాల మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభమైంది. ఈ సర్వీసును భారత పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ప్రారంభించారు. స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఈ నూతన సర్వీసును ప్రారంభించింది. ఇవాల ఉదయం దేశ రాజధాని ఢిల్లీ నుండి 9.50 గంటలకు బయల్దేరిన విమానం ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి నగరానికి మధ్యాహ్నం 12.10 గంటలకు చేరుకున్నది. కొత్త విమాన సర్వీసు ప్రారంభం సందర్భంగా కేంద్రమంత్రి సింథియా మాట్లాడారు. ఈ కొత్త విమాన సర్వీసు దేశ రాజధాని ఢిల్లీని, ఆధ్మాత్మిక రాజధాని తిరుపతిని కలుపుతున్నదని పేర్కొన్నారు. తిరుపతి దేవస్థానాన్ని ప్రతి ఏటా 3.5 కోట్ల మంది భక్తులు దర్శించుకుంటున్నారని అన్నారు.