తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది.

By Medi Samrat  Published on  18 Feb 2025 8:15 PM IST
తిరుమల కల్తీ నెయ్యి కేసులో ముగిసిన సిట్ విచారణ

తిరుమల కల్తీ నెయ్యి కేసులో నిందితులకు సిట్ విచారణ ముగిసింది. తిరుపతిలో సిట్ కార్యాయంలో ఐదు రోజుల పాటు ఈ విచారణ సాగింది. భోలే బాబా డెయిరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్, పోమిల్ జైన్, శ్రీ వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్ కాంత్ చావ్డా, ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ లను సిట్ ప్రశ్నించింది. నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. కస్టడీ ముగిసిన అనంతరం నిందితులను పోలీసులు తిరుపతి రెండో అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు.

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిన విషయం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నివేదిక ఆధారంగా దీనిపై దర్యాప్తుకు సిట్ బృందాన్ని నియమించారు. ఈ సిట్‌ దర్యాప్తు సీఐడీ ఆధ్వర్యంలో జరగాలని వైసీపీ నేతలు వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సీబీఐ డైరెక్టర్ నేతృత్వంలో సిట్ బృందాన్ని నియమించారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఆధ్వర్యంలో సిట్ బృందం పనిచేస్తోంది. గత ఏడాది నవంబర్​లో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం పలు దఫాలుగా విచారణ నిర్వహించింది. ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులు తిరుమల, తిరుపతితో పాటు నెయ్యి సరఫరా చేసిన తమిళనాడులోని దుండిగల్‍ ప్రాంతంలో ఉన్న ఏఆర్‍ డైయిరీలో విచారణ నిర్వహించారు.

Next Story