తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

By Medi Samrat
Published on : 27 Nov 2023 11:00 AM IST

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో టీటీడీ అధికారులు, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి, వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఇస్తికఫాల్ తో స్వాగతం పలకగా.. ప్రధాని ముందుగా ఆలయ ధ్వజ స్థంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో ప్రధానికి వేద పండితులు ఆశీర్వచనం పలకగా.. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి తీర్థ ప్రసాదాలను, స్వామి వారి చిత్ర పటాన్ని, టీటీడీ క్యాలెండర్, డైరీ 2024 పంచగవ్యాలను అందచేశారు. అంతకుమందు స్వామి వారి వద్ద ప్రధానిని శేష వస్త్రంతో ఆలయ ప్రధాన అర్చకులు సత్కరించారు.

ఈ సందర్భంగా 140 కోట్ల మంది భారతీయులకు మంచి ఆరోగ్యం, శ్రేయస్సు, అభివృద్ధి కలగాలని తిరుమలలోని శ్రీవారిని ఆలయంలో ప్రార్థించానని ప్రధాని ట్విట్టర్ వేదికగా తెలిపారు.

Next Story