లక్షిత మృతికి కారణం చిరుతే
తిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృతదేహానికి
By Medi Samrat Published on 12 Aug 2023 9:28 AM GMTతిరుమల నడకదారిలో చిరుత దాడిలో ప్రాణాలు కోల్పోయిన లక్షిత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తీ చేశారు అధికారులు. లక్షిత మృతికి చిరుతే కారణం తేల్చారు ఫోరెన్సిక్ నిపుణులు. చిరుతే దాడి చేసినట్లు స్పష్టం చేశారు ఫోరెన్సిక్ డిపార్ట్‌మెంట్ నిపుణులు. లక్షితను చిరుత చంపి తిన్నట్లు నిర్ధారించారు. తల భాగంపై అటాక్ చేసిన చిరుత.. ఆ తల భాగాన్ని తినేసినట్లు తెలిపారు. ఇక పోస్టుమార్టం అనంతరం అనంతరం లక్షిత మృతదేహాన్ని తిరుపతి రుయా మార్చురీ నుంచి నెల్లూరుకు తరలించారు.
లక్షిత మృతితో ఇటు కుటుంబంలో, అటు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. లక్షిత తల్లి మాట్లాడుతూ.. వన్య మృగాలు వరుసగా దాడులు చేస్తుంటే మెట్ల మార్గాన్ని ఎందుకు మూసివేయడం లేదని ప్రశ్నించారు. భక్తుల ప్రాణాలతో అధికారులు చెలగాటం ఆడుతున్నారని లక్షిత తల్లి కన్నీరుమున్నీరయ్యింది. తమ బిడ్డ మృతికి అధికారుల తీరే కారణమని ఆరోపించారు. గతేడాది కూడా తిరుమల వచ్చి.. ఇలాగే కాలినడకన కొండపైకి వెళ్లామనీ అప్పుడు కూడా పాప ఇలాగే వేగంగా మెట్లు ఎక్కుతూ ముందుకు వెళ్లిందనీ శశికళ తెలిపింది. అప్పుడు ఏమీ కాలేదనీ.. ఇప్పుడు కూడా పాప ఇలాగే చేసిందనీ కానీ ఇలా అవుతుందని తాము అనుకోలేదని తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.