తిరుమలలో ఘనంగా పార్వేట ఉత్సవం
Paruveta Utsavam In Srivari Temple. తిరుమల వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవము సోమవారం ఘనంగా జరిగింది.
By Medi Samrat Published on
16 Jan 2023 2:25 PM GMT

తిరుమల వేంకటేశ్వరస్వామి పార్వేట ఉత్సవము సోమవారం ఘనంగా జరిగింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు శ్రీమలయప్పస్వామి తిరుచ్చిలో వేంచేసారు. వారి వెంట మరో తిరుచ్చిపై శ్రీ కృష్ణస్వామి వేంచేసారు. అనంతరం పార్వేట మండపము నందు పుణ్యాహము, ఆరాధన, నివేదనము జరిగి హారతులు జరిగాయి. అనంతరం ఉభయదార్లకు తాళ్ళపాక వారికి, మఠంవారికి మర్యాదలు జరిగాయి.
శ్రీ కృష్టస్వామిని సన్నిధి యాదవ పూజ చేసిన చోటుకు వేంచేపుచేసి పాలు, వెన్న, హారతులు సమర్పించారు. తరువాత మలయప్పస్వామి ముందునకు కొంత దూరము పరుగెత్తి వారి తరపున అర్చకులు బాణమువేసిన పిమ్మట వెనుకకు వచ్చారు. ఇట్లు మూడుసార్లు జరిగింది. మలయప్పస్వామి ఉత్సవము పూర్తియి మహాద్వారమునకు వచ్చి హత్తీరాంజీవారి బెత్తమును తీసుకొని సన్నిధిలోనికి వేంచేసారు. ఇంతటితో పార్వేట ఉత్సవము ఘనంగా ముగిసిందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది.
Next Story