తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన ఉపయోగించినవి / పాక్షికంగా దెబ్బతిన్న 74 లాట్ల మొబైల్ ఫోన్లను జూన్ 20 నుండి 21వ తేదీ వరకు టీటీడీలో ఆన్ లైన్ ద్వారా ఈ – వేలం వేయనున్నారు.
కార్భన్, ఎల్.వై.ఎఫ్, నోకియా, శాంసంగ్, లావా, ఐటెల్, లెనోవా, ఫిలిప్స్, ఎల్.జి.సాంసుయ్, ఒప్పో, పోకో, ఏసర్, పానాసోనిక్, హానర్, వన్ ప్లస్, బ్లాక్ బెర్రి, ఎంఐ, జియోనీ, మైక్రోసాఫ్ట్ , ఆనస్, కూల్ పాడ్, హెచ్ టి సి, మోటోరోలా, టెక్నో, ఇంఫినిక్స్, రియల్ మీ, హువాయ్, సెల్కన్, వివో, మైక్రో మాక్స్ బ్రాండ్ లకు చెందిన మొబైల్ ఫోన్లు ఈఏఐడి నెం. 25132, 25133, 25134, 25135 ఆన్ లైన్ లో ఈ – వేలం వేయనున్నారు.
ఆసక్తి కల్గిన వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఈ –కొనుగోలు పోర్టల్ లో రిజిస్టర్ అయిన బిడ్డర్లు వేలంలో పాల్గొనటానికి అర్హులు. ఇతర వివరాలకు స్థానిక జనరల్ మేనేజర్(వేలంలు), / ఏఈవో ( వేలంలు), టిటిడి, హరే కృష్ణ మార్గ్, తిరుపతిలో https://konugolu. ap.gov.in లేదా టీటీడీ వెబ్ సైట్ www.tirumala.org లేదా 0877 – 2264429 ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.