తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఓ భక్తుడు భారీ విరాళం ప్రకటించాడు. ముంబైకి చెందిన సంజయ్ సింగ్ అనే శ్రీవారి భక్తుడు దాదాపు రూ.300 కోట్లతో 300 పడకల ఆస్పత్రిని నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సమక్షంలో ఒప్పందం కుదుర్చుకున్నాడు. త్వరలో ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. మరో వైపు సంజయ్ సింగ్‌ని టీటీడీ అభినందించింది. అయితే సాధారణంగా శ్రీవారిని భక్తులు ఎక్కువే ఉంటారు. తిరుమలకు వచ్చే భక్తులు శ్రీవారికి విరాళాలు సమర్పించుకుంటారు. తమ కోరికలు నెరవేరాలని విలువైన కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికే స్వామివారికి ఎన్నో విలువైన కానుకులు అందాయి. అందులో వజ్ర వైడుర్యాలు ఉన్నాయి.