తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి వీ‌.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి.

By Medi Samrat  Published on  25 Feb 2024 1:45 PM GMT
తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం

తిరుపతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి వీ‌.వీ మహాల్ రోడ్డులోని ఓ చెప్పుల దుకాణంలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. భయబ్రాంతులకు గురైన స్థానికులు వెంటనే పరుగుతీశారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనలో చెప్పులు దుకాణం పూర్తిగా దగ్ధమైంది. ఆ షాపు పైనే ఓ ఇల్లు ఉందని దుకాణం యజమాని తెలిపాడు. అంతేకాకుండా ఆ ఇంట్లో సిలిండర్లు ఉన్నాయని చెప్పడంతో అధికారులు మరింత అలర్ట్ అయ్యారు. ప్రమాదం పై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story