తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల గురించి ఈ వివరాలు తెలుసుకోండి

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం విచ‌క్ష‌ణ కోటాలో(discretionary quota) కేటాయించే బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే భ‌క్తుల సౌక‌ర్యార్థం

By Medi Samrat  Published on  8 Feb 2024 2:30 PM GMT
తిరుమల బ్రేక్ దర్శనం టికెట్ల గురించి ఈ వివరాలు తెలుసుకోండి

తిరుమల శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం విచ‌క్ష‌ణ కోటాలో(discretionary quota) కేటాయించే బ్రేక్ ద‌ర్శ‌నం టికెట్లు పొందే భ‌క్తుల సౌక‌ర్యార్థం టీటీడీ నూత‌నంగా ఎస్ఎంఎస్ పే సిస్ట‌మ్ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. ఫిబ్ర‌వ‌రి ఒక‌టో తేదీ నుండి ఈ విధానాన్ని అమ‌లుచేస్తోంది. నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపుతారు. భక్తులు ఆ లింక్ పైన క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు/ డెబిట్ కార్డు ద్వారా ఆన్లైన్ లో సొమ్ము చెల్లించవచ్చు. ఎంబీసీ-34 కౌంటర్ వద్దకు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా బ్రేక్ ద‌ర్శ‌న‌ టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఇప్ప‌టికే ఆఫ్‌లైన్‌లో సిఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లు పొందుతున్న‌ భక్తులకు ఈ విధానం అమ‌లు చేస్తున్నారు.

వైఎస్‌ఆర్ జిల్లా దేవుని కడపలో ఉన్న శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వరి 10 నుండి 18వ తేదీ వరకు జ‌రుగ‌నున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఫిబ్ర‌వరి 9వ తేదీ శుక్ర‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య అంకురార్పణ జ‌రుగ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 10వ తేదీ ఉద‌యం 10.30 గంట‌ల‌కు ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. రూ.300/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగనుంది. ఇందుకోసం భ‌క్తులు పుష్పాల‌ను స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భ‌క్తి సంగీత‌ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

Next Story