తిరుపతి కోర్టుకు హాజరైన 'మంచు' హీరోలు
Hero Manchu Vishnu and Mohanbabu attends Tirupathi Court. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ 2019లో నటుడు మోహన్ బాబు
By Medi Samrat Published on 28 Jun 2022 3:41 PM ISTఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలంటూ 2019లో నటుడు మోహన్ బాబు తన కొడుకులతో సహా ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో వారు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ కేసు నమోదయయ్యింది. ఆ కేసులో నటుడు మంచు మోహన్‌బాబు, ఆయన ఇద్దరు కుమారులు విష్ణు, మనోజ్‌లు ఈరోజు తిరుపతి కోర్టుకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం మంగళవారం తిరుపతికి వచ్చిన ముగ్గురు కోర్టులో న్యాయమూర్తి ఎదుట సంతకాలు చేశారు. కోర్టు విచారణను సెప్టెంబర్ 20కి వాయిదా వేయడంతో ముగ్గురు ఇంటికి వెళ్లిపోయారు.
ఈ సందర్భంగా మోహన్‌బాబు మాట్లాడుతూ.. తనకు కోర్టు సమన్లు రానప్పటికీ న్యాయమూర్తి పిలిస్తేనే వచ్చానని చెప్పారు. వివాదానికి దారితీసే అవకాశం ఉన్నందున ఈ అంశంపై తాను ఏమీ మాట్లాడలేనని అన్నారు. అయితే, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో తాను కూడా ఒకడినని పేర్కొంటూ ఇతర అంశాలపై మాట్లాడారు. పాదయాత్రలో కోర్టుకు రావడానికి గల కారణం ఏమిటని అడగ్గా.. రోడ్లపైకి వచ్చిన అభిమానులకు అభివాదం చేసేందుకు పాదయాత్ర ద్వారా వచ్చానని స్పష్టం చేశారు.
మార్చి 22, 2019న, ఫీజు రీయింబర్స్‌మెంట్ డిమాండ్‌తో మోహన్ బాబు కుటుంబం శ్రీవిద్యానికేతన్ విద్యార్థులతో ధర్నా చేసింది. దీంతో అప్పటి ఎంపీడీఓ, ఎంసీసీ టీం అధికారి హేమలత చంద్రగిరి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి పోలీసులు మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, ఏవో తులసి నాయుడు, శ్రీ విద్యా నికేతన్ విద్యాసంస్థల పీఆర్‌వో సతీష్‌లపై సెక్షన్ 290, 341, 171 (ఎఫ్) రెడ్ 34, సెక్షన్ 34 కింద పోలీస్ యాక్ట్, ఎన్నికల కోడ్ కింద కేసులు నమోదు చేశారు.