ఈ విషయం తెలుసుకోండి.. ఇకపై లక్కీడిప్ ద్వారా అంగప్రదక్షిణ టికెట్లు

ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది

By Medi Samrat  Published on  29 Aug 2024 3:45 PM GMT
ఈ విషయం తెలుసుకోండి.. ఇకపై లక్కీడిప్ ద్వారా అంగప్రదక్షిణ టికెట్లు

ప్రతి శనివారం తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులకు కేటాయిస్తున్న 250 శ్రీవారి ఆలయ అంగప్రదక్షిణ టికెట్లు, ఇకపై లక్కీడిప్ ద్వారా కేటాయించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. అంగప్రదక్షిణ టికెట్లు కావలసిన భక్తులు గురువారం ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు తమ ఆధార్ కార్డుతో ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వీరికి సాయంత్రం 5 గంటలకు లక్కీడిప్ ద్వారా టికెట్లు కేటాయిస్తారు. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులకు వారి మొబైల్ ఫోన్లకు ఎస్ఎంఎస్ రూపంలో సమాచారం వస్తుంది. లక్కీడిప్ లో టికెట్లు పొందిన భక్తులు ఆన్లైన్ లో రూ.500/- డిపాజిట్ చేయవలసి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన భక్తులు మహతి కళాక్షేత్రంలో తమ ఆధార్ కార్డు చూపి శుక్రవారం మధ్యాహ్నం 2 నుండి రాత్రి 8 గంటల వరకు అంగప్రదక్షిణ టికెట్లు పొందవచ్చు.

లక్కీ డిప్ లో టికెట్లు పొందిన భక్తులను శనివారం తెల్లవారుజామున అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. అనంతరం భక్తులు చెల్లించిన రూ.500/- డిపాజిట్ ను తిరిగి వారి ఖాతాల్లోకి టీటీడీ జమ చేస్తుంది. తిరుపతి అర్బన్, తిరుమల స్థానికులు కాని భక్తులు లక్కీ డిప్ లో అంగప్రదక్షిణ టోకెన్లు పొందితే వారికి, వారు చెల్లించిన రూ.500/- డిపాజిట్ టీటీడీ తిరిగి చెల్లించదు. అంగప్రదక్షిణకు కూడా అనుమతించరు.

Next Story