Heavy rush of pilgrims at Tirumala temple. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు.
By Medi Samrat Published on 7 April 2023 7:30 PM IST
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వేసవితో పాటు వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు విశేషంగా భక్తులు తరలివస్తున్నారు. ప్రస్తుతం టోకెన్ లేని భక్తులకు శ్రీవారి దర్శనం కోసం 48 గంటల సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. భక్తులు తమ తిరుమల యాత్ర ప్రణాళిక రూపొందించుకోవాలని విజ్ఞప్తి చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు తమవంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని ప్రకటనలో కోరింది.