రాష్ట్రపతికి రేణిగుంటలో‌ ఘన స్వాగతం

Grand Welcome President Ramnath Kovind. తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ మంగళవారం ఉదయం ఏపీకి

By Medi Samrat  Published on  24 Nov 2020 6:22 AM GMT
రాష్ట్రపతికి రేణిగుంటలో‌ ఘన స్వాగతం

తిరుమల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ గోవింద్‌ మంగళవారం ఉదయం ఏపీకి చేరుకున్నారు. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్‌ జగన్‌‌ ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుండి రోడ్డు మార్గంలో తిరుచానూరు చేరుకుని శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకుంటారు. అనంతరం 12.15 గంటలకు తిరుమల చేరుకుంటారు. శ్రీవారి దర్శనానంతరం 4.50 గంటలకు రేణిగుంట చేరుకుని, అక్కడి నుంచి అహ్మదాబాద్‌కు వెళతారు.

ఇదిలావుంటే.. ఈ స్వాగ‌త కార్య‌క్ర‌మానికి సీఎం జ‌గ‌న్‌తో పాటు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, జిల్లా ఇంచార్జీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర రెడ్డి, పార్లమెంట్ సభ్యులు విజయసాయిరెడ్డి త‌దిత‌రుల‌తో పాటు రెవెన్యూ , పోలీస్ అధికారులు, సిబ్బంది హాజ‌ర‌య్యారు.


Next Story
Share it