రేపు ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

Free special darshan quota Tokens for senior citizens and disabled. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని

By Medi Samrat  Published on  22 July 2022 7:31 AM GMT
రేపు ఆన్‌లైన్‌లో వృద్ధులు, దివ్యాంగులకు ఉచిత ప్ర‌త్యేక ద‌ర్శ‌నం కోటా విడుద‌ల

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఆగ‌స్టు నెల‌కు సంబంధించిన ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జులై 23వ తేదీన ఉద‌యం 9 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది. ఈ మేర‌కు టీటీడీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. రోజుకు వెయ్యి టోకెన్ల చొప్పున జారీ చేస్తారు. ఈ టోకెన్లు బుక్ చేసుకున్న వారిని మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స్లాట్‌లో ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తారు. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్‌లైన్‌లో ఉచిత ద‌ర్శ‌న టోకెన్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.
Next Story
Share it