ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ఆదివారం తెల్లవారుజామున 1.10గంటల సమయంలో తిరుపతికి సమీపంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్కోలజీ తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.6గా నమోదు అయినట్లు చెప్పింది. భూ కంప కేంద్రం తిరుపతికి ఈ శాన్య దిశలో 85 కిలో మీటర్ల దూరంలో, భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో భూప్రకంపనలు చోటు చేసుకోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. కాగా.. ఈ భూకంపం కారణంగా ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లినట్లు ఎలాంటి సమాచారం అందలేని అధికారులు తెలిపారు.