తిరుమలలో మరోసారి భద్రతా ఉల్లంఘన జరిగింది. శ్రీవారి ఆలయ పరిసరాల్లో అనధికార డ్రోన్ కెమెరా ఎగిరింది. ఓ యూట్యూబర్ కొన్ని నిమిషాలు పాటు డ్రోన్ కెమెరా ద్వారా ఆలయం పరిసరాలను చిత్రీకరించాడనే ఆరోపణలు ఉన్నాయి. భక్తులు అతడిని పట్టుకుని టీటీడీ విజిలెన్స్ అధికారులకు అప్పగించారు. విచారణ అనంతరం భక్తుడిని అరెస్ట్ చేశారు. శ్రీవారి ఆలయం నో ఫ్లైయింగ్ జోన్ అని తెలిసినా కూడా ఇలాంటి పనులు చేశారు. విజిలెన్స్ అధికారులు డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. తిరుమలలో ఆ వ్యక్తి ఈ రోజు ఉదయం నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నట్టు గుర్తించారు.