టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం

ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్ధ‌ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేసే

By Medi Samrat  Published on  1 Dec 2023 10:57 AM GMT
టీటీడీకి రూ.5 కోట్ల విద్యుత్ గాలిమర విరాళం

ముంబైకి చెందిన విష్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్ధ‌ టీటీడీకి రూ.5 కోట్ల విలువైన 800 కిలోవాట్‌ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమరను విరాళంగా అందించింది. ఈ మేర‌కు తిరుమ‌ల జీఎన్‌సీ ప్రాంతంలో గాలిమర ఏర్పాట్లను శుక్రవారం ఉదయం టీటీడీ ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఎపీఎస్ఈబీ నుండి అనుమ‌తులు వ‌చ్చిన త‌రువాత టీటీడీ ఛైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విద్యుత్ ఉత్ప‌త్తిని ప్రారంభించనున్నారు.

ఈ విద్యుత్ గాలిమర ద్వారా సంవ‌త్స‌రానికి 18 ల‌క్ష‌ల యూనిట్ల విద్యుత్‌ ఉత్ప‌త్తి అవుతుంది. దీనివ‌ల‌న ప్ర‌తి ఏడాది టీటీడీకి రూ.కోటి ఆదా అవుతుంది. కాగా ఇప్ప‌టికే టీటీడీ అవ‌స‌రాల‌కు 15 సంవత్సరాల క్రితమే ఈ కంపెనీ వారు 1.03 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే రెండు గాలి మర్లను ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ బాధ్యతను కంపెనీనే చూసుకుంటుంది. ప్రస్తుతం ఏర్పాటు చేస్తున్న 0.8 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే గాలిమర నిర్వహణను కూడా వీరే చూడనున్నారు.

Next Story