తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

Dollar seshadri died with heart attack. తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి డాలర్‌ శేషాద్రి వెళ్లారు.

By అంజి  Published on  29 Nov 2021 2:09 AM GMT
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి కన్నుమూత

తిరుమల తిరుపతి దేవస్థానం ఓఎస్డీ డాలర్‌ శేషాద్రి హఠాన్మరణం చెందారు. విశాఖపట్టణంలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి డాలర్‌ శేషాద్రి వెళ్లారు. ఈ క్రమంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఇవాళ తెల్లవారుజామున 4 గంటలకు డాలర్‌ శేషాద్రి కన్నుమూశారు. ఆస్పత్రిలో తరలించే లోపే తుదిశ్వాస విడిచారు. 1978లో టీటీడీలో ఒక సామాన్య ఉద్యోగిగా చేరిన శేషాద్రి తిరుగులేని వ్యక్తిగా మారారు. అప్పటి నుండి తిరుమల శ్రీవారి సేవలో డాలర్‌ శేషాద్రి పాల్గొంటున్నారు.

2007లోనే రిటైర్డ్‌ అయినప్పటికీ డాలర్‌ శేషాద్రి సేవలను గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఓఎస్డీగా కొనసాగిస్తోంది. అప్పటి నుండి శ్రీవారి సేవలో తరిస్తూ వస్తున్నారు. టీటీడీ అదనపు ఈవో ధర్మారెడ్డి మాట్లాడుత.. డాలర్‌ శేషాద్రి మరణం తిరుపతి దేవస్థానంకి తీరని నష్టమని, ఆయన లేని లోటు భర్తీ కాదని అన్నారు.

Next Story
Share it