తిరుమలలో శ్రీవారి దర్శనానికి ఎంత సమయం పడుతోందంటే.?
దసరా సెలవులు ముగుస్తూ ఉండడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు.
By Medi Samrat Published on 14 Oct 2024 1:15 AM GMTదసరా సెలవులు ముగుస్తూ ఉండడంతో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. 13.10.2024 న తిరుమల శ్రీవారిని 86,900 మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ అధికారులు తెలిపారు. 28,739 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీకి కానుకల రూపంలో 2.56 కోట్ల రూపాయలు వచ్చాయి. భక్తులు 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతూ ఉంది.
శ్రీవారి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు, సామాన్య భక్తులకు ఎలాటి ఆసౌకర్యాం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు టీటీడీ ఈవో జె.శ్యామలరావు చెప్పారు. టీటీడీ సిబ్బంది సంయమనంతో, ప్రణాళిక బద్ధంగా, సీనియర్ అధికారుల పర్య వేక్షణలో సేవలందించారని తెలిపారు. ఈ సందర్భంగా టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. తొమ్మిది రోజుల పాటు వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. 15 లక్షల మంది భక్తులు శ్రీవారి వాహన సేవలు వీక్షించారు. బ్రహ్మోత్సవాల్లో 6 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. గరుడసేవనాడు 82,043 మంది శ్రీవారిని దర్శించుకున్నారు. కాగా, గరుడసేవలో దాదాపు 3.5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండగా, మొత్తం 30 లక్షల లడ్డూలు విక్రయించారు. హుండీ కానుకల ద్వారా రూ.26 కోట్ల ఆదాయం వచ్చింది.